Surprise Me!

Hydra: థాంక్యూ రంగనాథ్ సార్..పార్కును కాపాడిన హైడ్రాకు ప్రజల ధ‌న్య‌వాదాలు | Asianet News Telugu

2025-07-06 0 Dailymotion

తెలంగాణలోని మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ స‌ర్కిల్‌లోని ఓల్డ్ అల్వాల్ గ్రామ‌ పంచాయ‌తీలోని 60, 61, 62, 63 స‌ర్వే నంబ‌ర్ల‌లోని రెడ్డి ఎన్‌క్లేవ్‌లో పార్కుని హైడ్రా కాపాడింది. 16 ఎక‌రాల‌కు పైగా ఉన్న ఈ లే ఔట్‌లో 235 వ‌ర‌కూ ప్లాట్లు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం లేఔట్ వేసిన వారి వార‌సులే ఈ పార్కును క‌బ్జా చేసిన‌ట్టు అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల‌తో పూర్తిస్థాయిలో విచార‌ణ చేప‌ట్టిన అధికారులు.. 2,640 గ‌జాల స్థ‌లం పార్కుకు కేటాయించిన‌దే అని నిర్ధారించారు. దీంతో ఆ పార్కులో క‌బ్జాల‌ను తొల‌గించి.. పార్కు ప్రొటెక్ట‌డ్‌ బై హైడ్రా అని బోర్డును ఏర్పాటు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ ను నిర్మించారు. కాగా, 2000 సంవ‌త్స‌రం నుంచి ఈ పార్కు కోసం తాము పోరాడుతున్నామ‌ని.. హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికింద‌ని స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. హైడ్రాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. థాంక్యూ హైడ్రా అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి కృత‌జ్జత‌లు తెలిపారు.


#HYDRA #ReddyEnclavePark #MedchalMalkajgiri #Hyderabad #Telangana #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️